ఈటలను విమర్శించే స్థాయి కాదు- పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతలు ఫైర్
BJP: హన్మకొండ జిల్లా కమలాపూర్ (Kamalapur) మండల కేంద్రంలో బీజేపీ (Bjp) నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్, మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, బండి కళాధర్ మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఈటల రాజేందర్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. హుజురాబాద్ (Huzurabad) అభివృద్ధి ఈటల రాజేందర్ వల్లే జరిగిందనేది జగమెరిగిన సత్యం అన్నారు.
పాడి కౌశిక్ రెడ్డి ఐరన్ లెగ్.. అడుగు పెట్టిన పార్టీ భస్మం
పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ఐరన్ లెగ్ నాయకుడు అని విమర్శించారు. కౌశిక్ అడుగు పెట్టిన పార్టీ భస్మమవటం ఖాయమన్నారు. సొంత గ్రామానికి రోడ్డు వేసుకోలేని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కౌశిక్ రెడ్డికి వారు సవాల్ విసిరారు. అక్రమ మార్గంలో పదవి పొందిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని ఆరోపించారు.
