తెలంగాణ

BJP: ఈటలను విమర్శించే స్థాయి కాదు- పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతలు ఫైర్

పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ఐరన్ లెగ్ నాయకుడు అని విమర్శించారు. కౌశిక్ అడుగు పెట్టిన పార్టీ భస్మమవటం ఖాయమన్నారు. సొంత గ్రామానికి రోడ్డు వేసుకోలేని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కౌశిక్ రెడ్డికి వారు సవాల్ విసిరారు. అక్రమ మార్గంలో పదవి పొందిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని ఆరోపించారు.

BJP: హన్మకొండ జిల్లా కమలాపూర్ (Kamalapur) మండల కేంద్రంలో బీజేపీ (Bjp) నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్, మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, బండి కళాధర్ మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఈటల రాజేందర్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. హుజురాబాద్ (Huzurabad) అభివృద్ధి ఈటల రాజేందర్ వల్లే జరిగిందనేది జగమెరిగిన సత్యం అన్నారు.

పాడి కౌశిక్ రెడ్డి ఐరన్ లెగ్.. అడుగు పెట్టిన పార్టీ భస్మం

పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ఐరన్ లెగ్ నాయకుడు అని విమర్శించారు. కౌశిక్ అడుగు పెట్టిన పార్టీ భస్మమవటం ఖాయమన్నారు. సొంత గ్రామానికి రోడ్డు వేసుకోలేని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కౌశిక్ రెడ్డికి వారు సవాల్ విసిరారు. అక్రమ మార్గంలో పదవి పొందిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని ఆరోపించారు.

ఈటల వల్లే హుజూరాబాద్ అభివృద్ధి

ప్రజా నాయకుడు ఈటలను (Eatala Rajendar) విమర్శించే స్థాయి నీది కాదని పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కేసీఆర్ అభివృద్ధి చేశారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు అభివృద్ధి జరగలేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఉన్న రోడ్లు, ప్రభుత్వ భవనాలు, విద్యాలయాలు, ఆసుపత్రి.. ప్రతి ఒక్కటి ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధే అని స్పష్టం చేశారు. మరోసారి ఈటల రాజేందర్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని పాడి కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు.

అధికారంలో లేనప్పుడు కూడా కోట్ల రూపాయల నిధులు తెచ్చారు

''మిస్టర్ కౌశిక్ రెడ్డి ఆకాశం మీద ఉమ్మి వేస్తే నీ ముఖం మీదే పడ్డట్టు.. ఈటలను విమర్శిస్తే నువ్వే ప్రజల్లో పలుచన అవుతావు. ఈటల కేవలం అధికారంలో ఉన్నప్పుడే కాదు అధికారంలో లేనప్పుడు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు తెచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాని నీకు ఈటల రాజేందర్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇంతకాలం సహించాం.. ఇకపై ఈటలను విమర్శిస్తే తగిన శాస్తి చేస్తాం'' అని బీజేపీ నాయకులు హెచ్చరించారు.

ఈ ప్రెస్‌మీట్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ (Pabbu Satish), హుజురాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బండి కళాధర్, శనిగరం సర్పంచ్ కొత్తపల్లి రాజు, బుర్ర కరుణాకర్, తుమ్మ శోభన్ బాబు, కనుకుంట్ల అరవింద్, కొండం శ్రీనివాస్, ఇనుగాల రత్నాకర్, పెండ్యాల తిరుపతి రెడ్డి, తూర్పాటి భాస్కర్, పుల్ల అద్భుత రావు, మార్క అశోక్, పిల్లి సతీష్, రాంశెట్టి రాజయ్య, పంజాల సారయ్య, చెలిక శ్రీనివాస్, మౌటం రమేష్ బాబు, అర్వపల్లి సామ్రాజ్యం గౌడ్, కొండమీదీ రవి, తూర్పాటి క్రాంతి, మౌటం సుభాష్, జక్కుల రమేష్, మునిగే రాజు, రాణప్రతాప్, ఓదెలు, సాంబయ్య, మౌటం సంపత్, ర్యాకం సంపత్, కట్కుకూరి శంకర్, పచ్చిమట్ల కుమారస్వామి, బైరీ రాజేష్, చేనుమల్ల రంజిత్, ప్రభాకర్ రెడ్డి, సుమన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తర్వాత చదవండి