క్రైమ్

భర్తే హంతకుడు.. వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామంలో వృద్ధురాలు దోమకొండ శంకరమ్మ (70) అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బులు, బంగారంపై దురాశతో భర్త దోమకొండ రామయ్య (80) భార్యను హత్య చేశాడు. ఈ కేసులో రామయ్య, హత్యకు సహకరించిన మృతురాలి మనవడిని (మైనర్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు, సాంకేతిక ఇతర ఆధారాలతో కేసులో మిస్టరీని ఛేదించారు పోలీసులు.