తెలంగాణ
Kavitha : హరీశ్ రావు అవినీతిపై సీఎంవోకు కవిత ఫిర్యాదు.. లేఖలు వైరల్!
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావును తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి టార్గెట్ చేశారు. గత ప్రభుత్వంలో హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించడంతో పాటు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎంవో లేఖలు రాశారు. అయితే, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన సందర్భంగా కల్వకుంట్ల కవిత సంచలన పోస్టు పెట్టారు. మాజీ మంత్రి హరీశ్ రావు అవినీతి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన సీఎంవో ఆఫీసుకు ఫిర్యాదు చేసిన లేఖలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. తన వద్ద హరీశ్ రావు అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, చర్యలు ఎప్పుడు తీసుకుంటారు సీఎం గారూ? అంటూ ప్రశ్నించారు.
