తెలంగాణ

Kavitha : హరీశ్ రావు అవినీతిపై సీఎంవోకు కవిత ఫిర్యాదు.. లేఖలు వైరల్!

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావును తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి టార్గెట్ చేశారు. గత ప్రభుత్వంలో హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించడంతో పాటు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎంవోకు లేఖలు రాశారు.

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావును తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి టార్గెట్ చేశారు. గత ప్రభుత్వంలో హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించడంతో పాటు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎంవోకు లేఖలు రాశారు.

kalvakuntla kavitha letter wrote to cmo

అయితే, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన సందర్భంగా కల్వకుంట్ల కవిత సంచలన పోస్టు పెట్టారు. మాజీ మంత్రి హరీశ్ రావు అవినీతి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన సీఎంవో ఆఫీసుకు ఫిర్యాదు చేసిన లేఖలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. తన వద్ద హరీశ్ రావు అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, చర్యలు ఎప్పుడు తీసుకుంటారు సీఎం గారూ? అంటూ ప్రశ్నించారు.

kalvakuntla kavitha letter wrote to cmo

లేఖలోని సారాంశం..

హరీశ్ రావు అవినీతిపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సీఎంవోకు ఈనెల 14న నాలుగు లేఖలు రాశారు. అవి తమకు అందినట్టు 18న సీఎంవో అధికారులు రిప్లయ్ ఇచ్చినట్టు కవిత వెల్లడించారు. రంగనాయక సాగర్ నిర్మాణ వ్యయం, డిజైన్ల మార్పు, బాధితులకు పరిహారం చెల్లించడంలో జాప్యం, ప్రాజెక్టు వ్యయం భారీగా పెంపు, సమీపంలో హరీశ్ రావు నిర్మించుకున్న ఫాంహౌస్ గురించి లేఖల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాటి మీద చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

kalvakuntla kavitha letter wrote to cmo

మంత్రిగా ఉన్నప్పుడు హరీశ్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ వద్ద ఫామ్‌హౌస్ నిర్మాణం, సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసు సమీపంలో భూమి రిజిస్ట్రేషన్, వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను కబ్జా చేసినట్టు కవిత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అలాగే మల్లన్న సాగర్ రిజర్వాయర్ భద్రత, నిర్మాణ లోపాలు, ప్రాజెక్టు వ్యయం పెంపుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ భూనిర్వాసితులకు పరిహారం త్వరితగతిన చెల్లించాలని లేఖలో కవిత పేర్కొన్నారు. ఇదిలాఉండగా, సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటనకు ముందు కవిత చేసిన ఆరోపణలు, ఆమె విడుదల చేసిన లేఖలు హాట్ టాపిక్ అయ్యాయి. కాగా, కవిత చేసిన ఆరోపణలు, ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలకు ఆదేశిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

kalvakuntla kavitha letter wrote to cmo

తర్వాత చదవండి