తెలంగాణ
Kishan Reddy: ఢిల్లీ పెద్దల ఫోకస్ పెరిగిన వేళ.. కిషన్ రెడ్డి నయా పొలిటికల్ స్కెచ్ అందుకేనా?
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ అధిష్ఠానం గట్టిగా కసరత్తు చేస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై ఢిల్లీ పెద్దలు స్పెషల్ ఫోకస్ పెట్టిన వేళ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తన పొలిటికల్ గేర్ మార్చేశారు. పైకి చాలా సాఫ్ట్‌గా కనిపిస్తూనే, ప్రత్యర్థుల ఊహకు అందని విధంగా వ్యూహాలు రచించడం ఆయన స్టైల్. అయితే, రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్‌లో మరింత కీలకంగా మారాలని, కేంద్ర నాయకత్వం రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తనను దాటి వెళ్లకూడదని కిషన్ రెడ్డి గట్టిగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే ఫుల్లీ ఛార్జ్ మోడ్‌లోకి వచ్చేసి, ‘నశాముక్త్ భారత్’ యాత్ర పేరుతో సరికొత్త పొలిటికల్ స్కెచ్‌ను అమలు చేస్తున్నారు.
