సినిమా
Krithi Shetty: 'జనవరి 12 విడుదల' తో హిట్ కొడితే మళ్ళీ క్రేజీ ఆఫర్స్..
Krithi Shetty: ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన యంగ్ బ్యూటీస్‌లో కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో ఈ బ్యూటీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఒక్క సినిమాతో చేతిలో 10 ప్రాజెక్ట్స్ వచ్చి పడ్డాయి. కానీ, అవేవీ అమ్మడిని స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టలేదు. బంగార్రాజు సూపర్ హిట్ కాగా, నానితో చేసిన శ్యామ్ సింగ రాయ్ మాత్రం యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత నుంచి హిట్ చూడలేదు. కొంత గ్యాప్ తర్వాత జనవరి 12 విడుదలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
