Krithi Shetty: ఒక్కసారిగా టాలీవుడ్లో హాట్ టాపిక్ అయిన యంగ్ బ్యూటీస్‌లో కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో ఈ బ్యూటీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఒక్క సినిమాతో చేతిలో 10 ప్రాజెక్ట్స్ వచ్చి పడ్డాయి. కానీ, అవేవీ అమ్మడిని స్టార్ హీరోయిన్గా నిలబెట్టలేదు. బంగార్రాజు సూపర్ హిట్ కాగా, నానితో చేసిన శ్యామ్ సింగ రాయ్ మాత్రం యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత నుంచి హిట్ చూడలేదు. కొంత గ్యాప్ తర్వాత జనవరి 12 విడుదలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అనిల్ రావిపూడి సినిమాలో కృతికి ఛాన్స్ వచ్చిందనగానే అందరికి అనిపించింది ఒకటే. ఈ సినిమాతో మళ్ళీ కృతి శెట్టి టాలీవుడ్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంది అని. దీనికి, కారణం దర్శకుడు అనిల్ రావిపూడి. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న నేపథ్యంలో తన మైల్ స్టోన్ మూవీ 10వ వస్తోన్న జనవరి 12 విడుదల కూడా భారీ హిట్ అని ఫిక్సైపోయారు. ఈ సినిమా సక్సెస్ ముఖ్యంగా కృతికి బాగా కీలకమని చెప్పాలి.
తెలుగుతో పాటు మిగతా భాషలలోనూ కృతికి అవకాశాలు అందాయి. కానీ, అవేవీ ఈ బ్యూటికి ఆశించిన మైలేజ్ ఇవ్వలేదు. వరుస ఫ్లాప్ మూలంగా ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. ఈ మధ్యలో వచ్చిన కొత్త హీరోయిన్స్ కొంత కృతికి అవకాశాలను లేకుండా చేశారనే చెప్పాలి. సక్సెస్‌లలో ఉంటేనే మన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కి అవకాశాలు. ఇది, కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.
ఇప్పుడు, కృతి శెట్టి ఆశలన్నీ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న జనవరి 12 మీదనే పెట్టుకుంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్ లాంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ యంగ్ బ్యూటీకి బాగా కలిసొచ్చే విషయమే. కానీ, ఈ సినిమా సక్సెస్..ఇందులో, తన పాత్రకి ఉన్న బలం..వచ్చే పేరు మీదనే టాలీవుడ్లో కొత్త అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంది. మన మేకర్స్ కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కిన హీరోయిన్స్‌కి ఛాన్సులివ్వడానికి వెనకాడరు. చూడాలి మరి, కృతికి 2027 ప్రారంభంలో రాబోతున్న జనవరి 12 విడుదల ఏమేరకు లిఫ్ట్ ఇస్తుందో.
