తెలంగాణ

సొరంగం తవ్వి నాగార్జున సాగర్‌లో ఏపీ జలదోపిడీ

KTR: నాగార్జున సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అక్రమంగా 90 టీఎంసీల నీటిని తరలించేందుకు సొరంగం తవ్వుతుంటే తెలంగాణ ప్రభుత్వం మత్తు నిద్రలో ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఏపీ జలదోపిడీపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు కేటీఆర్.