తెలంగాణ
TG: కేటీఆర్ కీలక ప్రకటన.. డీలిమిటేషన్‌కు బీఆర్ఎస్ సపోర్ట్!
TG: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కీలక ప్రకటన చేశారు. పార్లమెంటులో సీట్ల పెంపుకు సంబంధించిన తాజా డీలిమిటేషన్ ప్రతిపాదనకు తమ పార్టీ మద్దతు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యానికి ఎలాంటి నష్టం కలగకుండా రక్షణ కల్పించడంతో పాటు, తెలంగాణ లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.డీలిమిటేషన్ విషయంలో తమ పార్టీ వైఖరి మొదటి నుంచీ స్పష్టంగానే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న ప్రస్తుత 24 శాతం వాటా తగ్గకూడదని, తెలంగాణకు ఏమాత్రం అన్యాయం జరగకూడదని తాము నిరంతరం డిమాండ్ చేస్తూ వచ్చామని ఆయన తెలిపారు.
