తెలంగాణ

TG: కేటీఆర్ కీలక ప్రకటన.. డీలిమిటేషన్‌కు బీఆర్ఎస్ సపోర్ట్!

TG: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కీలక ప్రకటన చేశారు. పార్లమెంటులో సీట్ల పెంపుకు సంబంధించిన తాజా డీలిమిటేషన్ ప్రతిపాదనకు తమ పార్టీ మద్దతు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యానికి ఎలాంటి నష్టం కలగకుండా రక్షణ కల్పించడంతో పాటు, తెలంగాణ లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.

దక్షిణాది వాటాకు రక్షణ.. తెలంగాణకు 26 సీట్లు

డీలిమిటేషన్ విషయంలో తమ పార్టీ వైఖరి మొదటి నుంచీ స్పష్టంగానే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న ప్రస్తుత 24 శాతం వాటా తగ్గకూడదని, తెలంగాణకు ఏమాత్రం అన్యాయం జరగకూడదని తాము నిరంతరం డిమాండ్ చేస్తూ వచ్చామని ఆయన తెలిపారు. అయితే, 2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తి మారకుండా రక్షణ కల్పిస్తూ, సీట్లను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనతో తమ డిమాండ్‌కు న్యాయం జరిగిందని కేటీఆర్ వివరించారు. ఈ విధానం అమల్లోకి వస్తే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

రాజ్యసభలో అనుకూలంగా ఓటు..

తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్నందున, ఈ ప్రతిపాదనకు అనుకూలంగా తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఓటు వేస్తారని కేటీఆర్ ప్రకటించారు. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ల అంశంపైనా ఆయన తమ పార్టీ వైఖరిని గుర్తుచేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సపోర్ట్ ఇచ్చిందని, దాని అమలుకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని కేటీఆర్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.

తర్వాత చదవండి