తెలంగాణ
BRS Party: వైఎస్సార్, బాబు, రేవంత్ బాటలో కేటీఆర్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
తెలుగు రాష్ట్రాల్లో ‘పాదయాత్ర’ అనేది రాజకీయ నాయకులకు ఒక తిరుగులేని సెంటిమెంట్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యకు నడిచి వెళ్లి, ఆ తర్వాత అధికారం దక్కించుకున్న నేతల జాబితా చాలా పెద్దదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి మొదలుపెడితే.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారా లోకేష్, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వరకు అంతా పాదయాత్రలతోనే పవర్ ఛైర్ అందుకున్న వాళ్లే. ఇప్పుడు సరిగ్గా అదే సెంటిమెంట్‌ను నమ్ముకుని, మళ్లీ తెలంగాణలో గులాబీ జెండా ఎగురవేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి గతంలో ఎందరో నేతలకు కలిసొచ్చిన ఈ ‘పాదయాత్ర’ సెంటిమెంట్, కేటీఆర్ విషయంలోనూ వర్కౌట్ అవుతుందా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
