తెలంగాణ

TG: కేసీఆర్‌ లేకపోతే టీకాంగ్రెస్‌, టీబీజేపీ ఎక్కడివి.. అలుగునూరు సభలో కేటీఆర్‌ ఘాటు విమర్శలు!

TG: ఆనాడు గులాబీ జెండా ఎగరకపోతే అసలు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ, చివరికి తెలంగాణ ముఖ్యమంత్రి పదవే ఉండేది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు చౌరస్తా వేదికగా జరిగిన ‘దీక్షా దివస్’ స్ఫూర్తి బహిరంగ సభలో ఆయన పాల్గొని అధికార కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను తక్కువ చేసి చూపే ప్రయత్నాలపై కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.తెలంగాణ సాధన ఒక పద్మవ్యూహమని, అర్జునుడు, కృష్ణుడు తరహాలో కేసీఆర్ దాన్ని ఛేదించి రాష్ట్రాన్ని సాధించారని కేటీఆర్ కొనియాడారు. "రథం నడిపింది కేసీఆర్, రణం చేసింది కేసీఆర్. తెలంగాణ కథలో హీరో కేసీఆర్ అయితే, విలన్ మాత్రం కాంగ్రెస్ పార్టీనే. 1956లో ఉన్న తెలంగాణను ఏపీలో కలిపిందే కాంగ్రెస్.