తెలంగాణ
HMDA Land Auction: హైదరాబాద్ శివారులో భూముల వేలం.. మరోసారి హెచ్ఎండీఏ నోటిఫికేషన్!
రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ స్థలాలు, అభివృద్ధి చేసిన లేఅవుట్ ప్లాట్లను విక్రయించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో భూముల వేలం ద్వారా సుమారు రూ.600కోట్ల నిధులను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన రూ.1,500కోట్ల విలువైన భూముల వేలం ప్రక్రియ ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుండగానే, శనివారం మరో విడత భూముల విక్రయానికి హెచ్ఎండీఏ తాజా నోటిఫికేషన్ జారీ చేయడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
