International

Malaysia free Visa cancel: భారత పర్యాటకులకు మలేషియా షాక్.. వీసా రహిత ప్రవేశం రద్దు!

 మలేషియా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. భారత పర్యాటకులకు ఇప్పటివరకు అందిస్తున్న వీసా రహిత ప్రయాణ వెసులుబాటును నిలిపివేస్తూ షాకిచ్చింది. 2027 జనవరి 1వ తేదీ నుంచి భారతీయులు ఆ దేశంలోకి అడుగుపెట్టాలంటే ముందస్తుగా వీసా పొందడం తప్పనిసరి అని మలేషియా ఇమిగ్రేషన్ విభాగం స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం భారతీయులు ఎలాంటి వీసా లేకుండానే మలేషియాలో 30 రోజుల పాటు పర్యటించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రత్యేక సదుపాయం 2026 డిసెంబర్ 31వ తేదీతో ముగియనుండటంతో, నూతన సంవత్సరం నుంచి పర్యాటకులు తప్పనిసరిగా వీసా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.