Crime : ఫోన్ చూడొద్దన్నందుకు వివాహిత షాకింగ్ నిర్ణయం
ప్రతి చిన్న విషయానికే కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. మంచి చెడు, ముందు వెనుకా ఏం ఆలోచించడం లేదు. ఫలితంగా కుటుంబంలోని వారు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. పిల్లలు ఒంటరి వారు అవుతున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు అందరినీ దుఖ: సాగరంలోకి తీసుకెళ్తున్నాయి. విద్యార్థినీ విద్యార్థులు, వివాహితలు అధికంగా ప్రాణాలు తీసుకుంటున్న వారి జాబితాలో ఉంటున్నారు. ఫోన్ చూడొద్దని తల్లి మందలించడంతో పెళ్లయిన కూతురు ప్రాణాలు తీసుకున్న ఘటన తాజాగా హైదరాబాద్ పరిధిలోని హయత్ నగర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. అస్తమానం ఫోన్ చూస్తున్నావంటూ తల్లి మందలించింది. ఫోన్ పక్కనపెట్టి ఏదైనా పని చేసుకోవాలని హితవు పలికింది. తల్లి మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మీదేవి (25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.
