క్రైమ్

Crime : ఫోన్ చూడొద్దన్నందుకు వివాహిత షాకింగ్ నిర్ణయం

ప్రతి చిన్న విషయానికే కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. మంచి చెడు, ముందు వెనుకా ఏం ఆలోచించడం లేదు. ఫలితంగా కుటుంబంలోని వారు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. పిల్లలు ఒంటరి వారు అవుతున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు అందరినీ దుఖ: సాగరంలోకి తీసుకెళ్తున్నాయి.

ప్రతి చిన్న విషయానికే కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. మంచి చెడు, ముందు వెనుకా ఏం ఆలోచించడం లేదు. ఫలితంగా కుటుంబంలోని వారు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. పిల్లలు ఒంటరి వారు అవుతున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు అందరినీ దుఖ: సాగరంలోకి తీసుకెళ్తున్నాయి. విద్యార్థినీ విద్యార్థులు, వివాహితలు అధికంగా ప్రాణాలు తీసుకుంటున్న వారి జాబితాలో ఉంటున్నారు.

ఫోన్ చూడొద్దని తల్లి మందలించడంతో పెళ్లయిన కూతురు ప్రాణాలు తీసుకున్న ఘటన తాజాగా హైదరాబాద్ పరిధిలోని హయత్ నగర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. అస్తమానం ఫోన్ చూస్తున్నావంటూ తల్లి మందలించింది. ఫోన్ పక్కనపెట్టి ఏదైనా పని చేసుకోవాలని హితవు పలికింది. తల్లి మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మీదేవి (25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.

మృతురాలి స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లమ్మ రంగాపురం. ఇదిలాఉండగా,లక్ష్మిదేవికి నల్గొండ జిల్లా టీపీగౌరారం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల భార్యకు ఈఎంఐ ఆప్షన్ మీద భర్త సెల్‌ఫోన్ కొనిచ్చాడు. అయితే, ఆ ఫోన్‌కే సమయం కేటాయించడం మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే తల్లి మందలించడంతో కూతురు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

లక్ష్మీదేవి తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా ఆమె పిల్లలు అనాథలుగా మిగిలారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిని కోల్పోయిన పిల్లలు ఒంటరి కావడంతో స్థానికంగా పరిస్థితులు తీవ్ర విషాదంగా మారాయి.

తర్వాత చదవండి