National

Foreign Investors: ‘మేఘా’ విలువ రూ. లక్ష కోట్లు.. గ్లోబల్ ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులు!

Foreign Investors: దేశంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తెలుగు దిగ్గజ సంస్థ ‘మేఘా ఇంజినీరింగ్ గ్రూప్’ మరో కీలక మైలురాయిని చేరుకుంది. కంపెనీ మొత్తం విలువ సుమారు రూ. లక్ష కోట్లకు చేరడంతో పాటు, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 700 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులను ఆకర్షించింది.మేఘా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలైన డీకే, హెచ్‌హెచ్, వర్డే పార్ట్‌నర్స్ ముందుకు వచ్చాయి. స్ట్రక్చర్డ్ ఈక్విటీ పెట్టుబడులు, రోడ్ అసెట్స్ మానిటైజేషన్ ద్వారా ఈ 700 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు డీల్ కుదిరింది. మరోవైపు, గ్రూపునకు చెందిన ఎనర్జీ ట్రాన్సిషన్ విభాగం ఈపీటీఎల్ విలువను కూడా రూ. 14 వేల కోట్లుగా అంచనా వేశారు.