తెలంగాణ

సీఎం కూతురు కార్పొరేట్ స్కూల్స్.. మంత్రి కుమార్తె ఇంటర్నేషనల్ స్కూల్స్!

Manne Krishank తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబ సభ్యుల వ్యాపార వ్యవహారాలను ప్రస్తావిస్తూ పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేస్తూ.. పాలకుల కుటుంబాలు ప్రైవేట్ విద్యా వ్యాపారాలపై దృష్టి పెడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు క్రిశాంక్.