తెలంగాణ

కవిత గురించి కావాలని అన్న మాట కాదు- మంత్రి సీతక్క విచారం

Seethakka: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం పట్ల మంత్రి సీతక్క స్పందించారు. పొరపాటు జరిగిందని విచారం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను ప్రస్తావించే క్రమంలో తన నోటి నుంచి పొరపాటున పదం దొర్లిందని, అందుకు చింతిస్తున్నానని మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని సీతక్క తీవ్రంగా ఖండించారు.