తెలంగాణ

TG: మత్స్యకారుల పొట్టకొట్టొద్దు.. కలెక్టర్లకు మంత్రి వాకిటి శ్రీహరి 10 రోజుల డెడ్‌లైన్!

TG: వాతావరణ మార్పులు, 'ఎల్‌నినో' ప్రభావం కారణంగా చెరువులు, జలాశయాల్లో నీరు తగ్గిపోయి మత్స్యకారుల పొట్టకొట్టే పరిస్థితి రాకూడదని తెలంగాణ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. నీటి నిల్వలు అడుగంటితే చేపల పెంపకంపై ఆధారపడి బతికే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉండటంతో మంత్రి వాకిటి శ్రీహరి తక్షణమే రంగంలోకి దిగారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. మత్స్యకారుల ఉపాధికి ఎలాంటి నష్టం కలగకుండా వారం నుంచి పది రోజుల్లోగా క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేయాలని కలెక్టర్లకు స్పష్టమైన డెడ్‌లైన్ విధించారు.ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో వాతావరణం ప్రతికూలంగా మారి, నీటి వనరులు వేగంగా ఆవిరయ్యే ప్రమాదం ఉందని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను అప్రమత్తం చేశారు. పరిస్థితి చేయి దాటకముందే నీటిపారుదల, మత్స్యశాఖ అధికారులు సమన్వయంతో రంగంలోకి దిగాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి చెరువు, జలాశయంలో ప్రస్తుతం ఎంత నీరుంది?