తెలంగాణ

కొత్త బోర్లపై నిషేధం.. కోట్లు సంపాదిస్తున్న మాఫియా!

Borewells: తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, బోర్లు వేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు అదే ప్రభుత్వం ఎడాపెడా నిర్మాణ అనుమతులు మాత్రం జారీ చేస్తూనే ఉంది. నీరు లేకుండా ఇల్లు ఎలా కట్టాలి? నీరు లేకుండా మనిషి ఎలా బతకాలి? అనే ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. కానీ ఈ వైరుధ్యమే నేడు కొందరికి కాసుల పంటగా మారిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.