National
MK Stalin: ఇండియా కూటమికి భారీ షాక్.. తగ్గేది లేదన్న స్టాలిన్
MK Stalin: డీలిమిటేషన్ బిల్లు విషయంలో విపక్ష ఇండియా కూటమికి కోలుకోలేని దెబ్బ తగిలింది. తమ కీలక మిత్రపక్షం మద్దతు కూడగట్టుకునేందుకు దేశంలోని అగ్రనేతలంతా ఆగమేఘాల మీద చెన్నైకి తరలివచ్చినా.. తమిళనాడు మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. "తగ్గేది లేదు.. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు" అని ఆయన కుండబద్దలు కొట్టడంతో ఇండియా కూటమి ఆశలు ఆవిరైపోయాయి.డీలిమిటేషన్ బిల్లును అడ్డుకోవాలంటూ స్టాలిన్‌ను ఒప్పించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఎం నేత ఎంఏ బేబీ, సీఎంలు రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, వీడీ సతీశన్ తదితర ముఖ్య నేతలంతా చెన్నై చేరుకున్నారు. స్టాలిన్‌తో ప్రత్యేకంగా సమావేశమై, కూటమి ఐక్యత దృష్ట్యా బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని గట్టిగానే కోరారు.
