జాతీయం

MK Stalin: ఇండియా కూటమికి భారీ షాక్‌.. తగ్గేది లేదన్న స్టాలిన్

MK Stalin: డీలిమిటేషన్ బిల్లు విషయంలో విపక్ష ఇండియా కూటమికి కోలుకోలేని దెబ్బ తగిలింది. తమ కీలక మిత్రపక్షం మద్దతు కూడగట్టుకునేందుకు దేశంలోని అగ్రనేతలంతా ఆగమేఘాల మీద చెన్నైకి తరలివచ్చినా.. తమిళనాడు మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. "తగ్గేది లేదు.. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు" అని ఆయన కుండబద్దలు కొట్టడంతో ఇండియా కూటమి ఆశలు ఆవిరైపోయాయి.

డీలిమిటేషన్ బిల్లును అడ్డుకోవాలంటూ స్టాలిన్‌ను ఒప్పించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఎం నేత ఎంఏ బేబీ, సీఎంలు రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, వీడీ సతీశన్ తదితర ముఖ్య నేతలంతా చెన్నై చేరుకున్నారు. స్టాలిన్‌తో ప్రత్యేకంగా సమావేశమై, కూటమి ఐక్యత దృష్ట్యా బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని గట్టిగానే కోరారు. అయితే, ఈ రాజకీయ ఒత్తిళ్లకు గానీ, బుజ్జగింపులకు గానీ తలొగ్గే ప్రసక్తే లేదని స్టాలిన్ తేల్చి చెప్పేశారు.

ఇండియా కూటమిలో అత్యంత కీలకమైన డీఎంకే తన పట్టు వీడకపోవడంతో ఇప్పుడు సమీకరణాలన్నీ మారిపోయాయి. అగ్రనేతల భేటీ తర్వాత కూడా స్టాలిన్ తన నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేయడంతో, రేపు పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు సునాయాసంగా పాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మిత్రపక్షాల ఒత్తిడిని కాదని స్టాలిన్ తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్, అటు ఇండియా కూటమిలో ప్రకంపనలు రేపుతుండగా.. ఇటు పార్లమెంట్‌లో బిల్లు ఆమోదానికి లైన్ క్లియర్ చేసినట్లయింది.

తర్వాత చదవండి