తెలంగాణ
కేసీఆర్ అడిగినప్పుడల్లా నిధులిచ్చారు- రాజాసింగ్ సంచలనం
Raja Singh: నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయాల్లో హీట్ పెంచాయి. తాజాగా ఈ అంశంపై గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
సీఎంకు అనుకూలమైన ఎమ్మెల్యేలకే నిధులు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను రాజాసింగ్ సమర్థించారు. సీఎం రేవంత్ తన నియోజకవర్గంతో పాటు తనకు అనుకూలమైన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. గోశామహల్ నియోజకవర్గానికి కూడా నిధులు ఇవ్వడం లేదని వాపోయారు.
