తెలంగాణ

Raja Singh: రాజగోపాల్ రెడ్డి చెప్పింది నిజమే.. కేసీఆర్ అడిగినప్పుడల్లా నిధులిచ్చారు- రాజాసింగ్ సంచలనం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను రాజాసింగ్ సమర్థించారు. సీఎం రేవంత్ తన నియోజకవర్గంతో పాటు తనకు అనుకూలమైన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. గోశామహల్ నియోజకవర్గానికి కూడా నిధులు ఇవ్వడం లేదని వాపోయారు.

Raja Singh: నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయాల్లో హీట్ పెంచాయి. తాజాగా ఈ అంశంపై గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సీఎంకు అనుకూలమైన ఎమ్మెల్యేలకే నిధులు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను రాజాసింగ్ సమర్థించారు. సీఎం రేవంత్ తన నియోజకవర్గంతో పాటు తనకు అనుకూలమైన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. గోశామహల్ నియోజకవర్గానికి కూడా నిధులు ఇవ్వడం లేదని వాపోయారు.

ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కేసీఆర్ పని చేశారు

కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అడిగినప్పుడల్లా నిధులు ఇచ్చారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ పని చేశారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ ను కోరారు రాజాసింగ్.

సీఎం రేవంత్, ప్రభుత్వానికి చెడ్డ పేరు

ప్రస్తుత ప్రభుత్వంలో ఏ అధికారి కూడా ఎమ్మెల్యేల మాట వినడం లేదన్నారు. ఇలాగేనా బంగారు తెలంగాణ సాధించేది? అంటూ ప్రశ్నించారు. నిధులు ఇవ్వకుండా పక్షపాత ధోరణి కరెక్ట్ కాదన్నారు. గత ప్రభుత్వంలో మాత్రం ఈ సమస్య లేదన్నారాయన. సర్వే చేయించి ఏ నియోజకవర్గం నుంచి ఎంత ఆదాయం వస్తుందో చూడాలన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న రాజాసింగ్.. సీఎం రేవంత్, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. బంగారు తెలంగాణ కావాలంటే ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలని రాజాసింగ్ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధుల సమస్య రాలేదు

''గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పరంగా ఎక్కడా నిధుల సమస్య రాలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ కూడా రాలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క ఆఫీసర్ కూడా ఎమ్మెల్యే మాట వినడం లేదు. ఇలాంటి మున్సిపల్ కమిషనర్ ను ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎత్తడు, మేసేజ్ కి సమాధానం ఇవ్వడు. రోడ్లు, ఫుట్ పాత్ లు కబ్జా అవుతున్నాయి.. దానివల్ల ట్రాఫిక్ సమస్య వస్తోంది అంటే కమిషనర్ నుంచి ఎటువంటి స్పందన లేదు.

తెలంగాణలో గుండాల రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తోంది

రాజగోపాల్ రెడ్డి అన్నది కరెక్టే. మొత్తం గూండా రాజ్యం నడుస్తోంది, అవినీతి రాజ్యం నడుస్తోంది తెలంగాణలో. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు పోతున్నాయి. ఇది పద్ధతి కాదు. గుర్తు పెట్టుకోండి. బీఆర్ఎస్ ఎప్పుడూ కూడా మాకు సపోర్ట్ చేయలేదు. కానీ, నిధుల విషయంలో ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేదు. ప్రతి నియోజకవర్గం డెవలప్ కావాలనే ఆలోచనతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేశారు'' అని రాజాసింగ్ అన్నారు.

తర్వాత చదవండి