తెలంగాణ
Balmoor Venkat : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కారుకు ఘోర ప్రమాదం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కారు ప్రమాదానికి గురైంది. కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లిన ఎమ్మెల్సీ వెంకట్ దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ సమీపంలో తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఉదయం కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఎమ్మెల్సీ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం.దారి కనిపించకపోవడంతో ముందు వెళ్తున్న డీసీఎంను వేగంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారు దెబ్బతిన్నప్పటికీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ దంపతులు ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.వారితో పాటు ఉన్న వెంకట్ తమ్ముడు చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
