తెలంగాణ

Balmoor Venkat : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కారుకు ఘోర ప్రమాదం

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు వరుసగా ప్రమాదానికి గురవుతున్నారు. ఇటీవల ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కారు ఒకే రోజు రెండు సార్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్‌పీ)ని స్థాపించిన మాజీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారు కూడా ఘోర ప్రమాదానికి గురైంది.

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు వరుసగా ప్రమాదానికి గురవుతున్నారు. ఇటీవల ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కారు ఒకే రోజు రెండు సార్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్‌పీ)ని స్థాపించిన మాజీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారు కూడా ఘోర ప్రమాదానికి గురైంది. ఆ సమయానికి మల్లన్న కారులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆయన అనుచరులకు తీవ్ర గాయాలు అయ్యాయి.తాజాగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కారుకు సైతం ప్రమాదం జరిగింది.

Balmoor Venkat :   ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కారుకు ఘోర ప్రమాదం

కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లిన ఎమ్మెల్సీ వెంకట్ దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ సమీపంలో తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఉదయం కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఎమ్మెల్సీ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం.దారి కనిపించకపోవడంతో ముందు వెళ్తున్న డీసీఎంను వేగంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.

ఈ ప్రమాదంలో కారు దెబ్బతిన్నప్పటికీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ దంపతులు ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.వారితో పాటు ఉన్న వెంకట్ తమ్ముడు చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్సీకి ఏమీ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి గురైన వాహనం నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం తక్షణ సహాయం అందించి స్థానిక ఆస్పత్రికి తరలించారు.ఆ వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

తర్వాత చదవండి