తెలంగాణ
విద్యార్థుల స్థానికత హక్కులు కాలరాయొద్దు- ఇంటర్ రద్దుపై సీఎంకు దాసోజు శ్రవణ్ లేఖ
Dasoju Sravan: ఇంటర్మీడియట్ రద్దుపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ సంధించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. తెలంగాణ విద్యార్థుల స్థానికత హక్కులు కాలరాయొద్దని లేఖలో కోరారు. స్వార్థపూరిత ఇంటర్మీడియట్ రద్దు నిర్ణయాన్ని నిలిపివేయాలని సీఎం రేవంత్ కి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఇంటర్మీడియట్ను రద్దు చేసి 9 నుండి 12వ తరగతి వరకు ఒకే బడిగా మారిస్తే తెలంగాణ విద్యార్థుల స్థానికతపై రేవంత్ ప్రభుత్వం దాడి చేసినట్లే అని ఆరోపించారు.
