Cm Revanth Reddy : ప్రధాని పదవిని శాశ్వతం చేసుకోవడానికి మోడీ కుట్ర : సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రంలో నాలుగోసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకుని, ప్రధాని పదవిని శాశ్వతం చేసుకోవడానికి నరేంద్ర మోడీ కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.అందుకోసం ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకుంటున్నాని అన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ‘సంవిధాన్ రక్షా మార్చ్’ పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. బీ.ఆర్.అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఈ ప్రదర్శన సాగింది. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కీలక ప్రసంగం చేశారు. దేశ ప్రజలకు సమాన న్యాయం, హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగ రూపకల్పన జరిగిందని, దళితులు, గిరిజనులు, మహిళలకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు నాడు జరిగిన కుట్రలను అంబేడ్కర్ తిప్పికొట్టారని చెప్పారు. అందుకే ఓటు హక్కు అందిరికీ సాధ్యం అయిందన్నారు.
