స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

VC Sajjanar : సజ్జనార్ సార్..ఇప్పుడేమంటారు?

హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఈ పేరు ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు. ఒకరు కాదు ఇద్దరు కాదు. వరుసగా ఆరోపణలు, అంతకు మించి విమర్శలు. అసలేం జరిగింది. ఏం జరుగుతోంది? స్వేచ్ఛ న్యూస్ ముందు నుంచీ చెబుతున్నదే నిజమైందా? మేం మాట్లాడింది.. మాట్లాడుతోందే నిజం కాబట్టి అదే జరిగింది. అదే జరిగి తీరుతుంది. ఎందుకంటే మేం నిజమే చెప్పాం. నిప్పులాంటి నిజాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేశాం. అదీ స్వేచ్ఛ న్యూస్ నైజం. వాస్తవానికి ఒక బదిలీతో వివాదం ముగిసిపోతుందనుకున్నారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది.