Health

Natural Skin Care: పులిపిర్లు ఎన్ని ఉన్నా ఇట్టే రాలిపోతాయి.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా చేయండి!

మెడ, ముఖం లేదా శరీరంపై వచ్చే పులిపిర్లు చూడటానికి ఎంతో ఇబ్బందిగా ఉంటాయి. గోధుమ రంగులో లేదా నల్లగా కనిపించే ఇవి.. చర్మంపై ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు లేదా ఒంట్లో విటమిన్ల లోపం వల్ల పుట్టుకొస్తుంటాయి. మొదట్లో చిన్నగా ఉన్నా, రోజులు గడిచేకొద్దీ సైజు పెరిగి దురద, చికాకు కలిగిస్తాయి. వీటిని వదిలించుకోవడానికి చాలామంది వేలకు వేలు ఖర్చు పెట్టి క్రీములు వాడటం, లేజర్ ట్రీట్‌మెంట్లు చేయించుకోవడం చేస్తుంటారు. కానీ పైసా ఖర్చు లేకుండా, చర్మంపై ఎలాంటి మచ్చ కూడా పడకుండా ఇంట్లోనే పులిపిర్లను రాలగొట్టే ఒక అద్భుతమైన చిట్కా ఉంది.