National
India Nepal: ప్రధాని మోదీతో నేపాల్ ప్రధాని బాలేన్ షా భేటీ.. ద్వైపాక్షిక చర్చలు షురూ!
భారత్, నేపాల్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం భారత్‌కు చేరుకున్న నేపాల్ ప్రధానమంత్రి(Nepal PM) బాలేంద్ర (బాలేన్) షా, న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో నేడు(సోమవారం) భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)తో ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించారు. అంతకుముందు ఉదయం రాష్ట్రపతి భవన్(Rastrapati bhavan) ప్రాంగణంలో నేపాల్ ప్రధానికి ప్రధాని మోదీ ఘన స్వాగతం పలకగా, సాయుధ దళాల గౌరవ వందనం సమర్పించాయి.
