తెలంగాణ

TG: నిమ్స్‌లో చుక్క నీరు రాక రోగుల నరకయాతన.. మిలీనియం బ్లాక్‌లో అవస్థలు!

TG: మెరుగైన వైద్యం కోసం ఎంతో ఆశతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఊహించని కష్టం ఎదురైంది. ఆసుపత్రిలోని అత్యంత కీలకమైన మిలీనియం బ్లాక్‌లో గురువారం సాయంత్రం నుంచి అకస్మాత్తుగా నీటి సరఫరా ఆగిపోవడంతో రోగులు, వారి వెంట వచ్చిన కుటుంబ సభ్యులు అక్షరాలా నరకయాతన అనుభవించారు.సాయంత్రం వేళ ఒక్కసారిగా నల్లాల్లో చుక్క నీరు కూడా రాకపోవడంతో వార్డుల్లో పరిస్థితి దారుణంగా మారింది. వాష్‌రూమ్‌లు వాడుకోవడానికి వీల్లేకపోవడంతో ఇన్‌పేషెంట్లు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఆపరేషన్లు చేయించుకుని బెడ్ మీదే ఉన్నవారు, నడవలేని స్థితిలో ఉన్న రోగులు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా లేక విలవిలలాడిపోయారు.