సినిమా
Nivetha Thomas: గృహిణిగా నివేదా థామస్.. ‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల!
Nivetha Thomas: సౌత్ క్రేజీ యంగ్ హీరోయిన్ నివేదా థామస్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీమతి’. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక, ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇదో మధ్యతరగతి గృహిణి జీవితంలోని భావోద్వేగాలు, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత ఆశయాల చుట్టూ తిరిగే కథగా సినిమాను రూపొందిస్తున్నట్టుగా అనిపిస్తోంది.
