Nivetha Thomas: సౌత్ క్రేజీ యంగ్ హీరోయిన్ నివేదా థామస్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీమతి’. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక, ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇదో మధ్యతరగతి గృహిణి జీవితంలోని భావోద్వేగాలు, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత ఆశయాల చుట్టూ తిరిగే కథగా సినిమాను రూపొందిస్తున్నట్టుగా అనిపిస్తోంది.
ఇక, ఈ చిత్రంలో నివేదా థామస్ మధుశ్రీ అనే మధ్యతరగతి గృహిణి పాత్రలో నటిస్తోంది. పెళ్లి తర్వాత, సాధారణంగా మహిళ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, కుటుంబం కోసం తనను తాను మర్చిపోయే సందర్భాలు, తనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఆశయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ లో హింట్ ఇచ్చారు.
చిత్ర దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. తిరువీర్, రేణు దేశాయ్ ఇందులో కీలక పాత్రలను పోషించారు. పూర్తిగా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలో కాకుండా, నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ మధ్య కొంతమంది స్టార్స్ థియేట్రికల్ రిలీజ్ మూవీస్ కంటే ఓటీటీ ప్లాట్ ఫాంలో వచ్చే సినిమాలకే ఎక్కువ ప్రధాన్యతను ఇస్తున్నారు. అవి, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే, ఇప్పుడు నివేదా కూడా ‘శ్రీమతి’ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దిగ్గజ ఓటీటీ సంస్థ జీ5లో ఈ డిసెంబర్ 4 నుంచి ‘శ్రీమతి’ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. 35 చిన్న కథ కాదు చిత్రంతో వచ్చి అలరించింది నివేదా. ఈ సినిమాకి జాతీయ అవార్డ్ కూడా దక్కింది. మళ్ళీ, రెండేళ్ల తర్వాత నివేదా థామస్ నటించిన ‘శ్రీమతి’ ఎలాంటి కథతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలనే ఆసక్తి ఇటు ప్రేక్షకుల్లో అటు ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. మరి, ఈ ‘శ్రీమతి’ కథ ఓటీటీ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
