ఉత్తరాదికి 400 ప్లస్.. దక్షిణాదికి 195 మాత్రమే.. సౌత్ కు తీరని అన్యాయం?
North vs South: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చేసే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రతిపాదన ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళనకు కారణమవుతోంది. ప్రస్తుతం 543గా ఉన్న లోక్సభ స్థానాలను ఏకంగా 816కు పెంచేలా కేంద్రం వేస్తున్న అడుగులు 'ఉత్తర - దక్షిణ' భారత్ మధ్య తీవ్ర అసమానతలకు దారితీస్తాయన్న చర్చ జోరందుకుంది. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచుతున్నామని పైకి చెబుతున్నప్పటికీ.. లోతుగా లెక్కలు తీస్తే దేశ అధికార పీఠాన్ని శాసించే శక్తి పూర్తిగా ఉత్తరాది చేతుల్లోకి వెళ్లిపోయి, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత నామమాత్రంగా మారిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.లోక్సభ బలం 816కు చేరితే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 409 సీట్లు అవుతుంది. కొత్త నమూనాలో రాష్ట్రాల వారీగా పెరిగే సీట్ల సంఖ్యను పరిశీలిస్తే, దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
