తెలంగాణ

Bhu Bharati LandScam: భూ భారతి కాదు.. 'భూ హారతి'.. ఏకంగా రిటైర్డ్ ఐపీఎస్ భూమికే ఎసరు!

తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన కోసం తీసుకువచ్చిన 'భూ భారతి' పోర్టల్ సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు సాగిస్తున్న భారీ భూదందా సంచలనం సృష్టిస్తోంది. రిటైర్డ్ ఉన్నతాధికారులు, ప్రవాస భారతీయులు (NRI), స్థానికంగా నివాసం ఉండని భూ యజమానులే లక్ష్యంగా ఓ ముఠా ఏకంగా వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి యాజమాన్య హక్కులను తారుమారు చేసింది. ఈ క్రమంలో ఏకంగా ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భూమినే కాజేసేందుకు ప్రయత్నించడం, రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ కుంభకోణం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతుండటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.