క్రైమ్
Harrasment : విద్యార్థినికి అసభ్యకర మెసేజ్‌లు.. లెక్చరర్‌ను చితకబాదిన స్టూడెంట్స్
ఓ లెక్చరర్ విద్యార్థినికి అసభ్యకర మెసేజెస్ చేయడం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పటేల్‌గూడలో ఉన్న ఎల్లంకి పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థులు ఓ లెక్చరర్‌ను చితకబాదారు. డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి ఇంగ్లీష్ లెక్చరర్ రవి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ రోజూ చాటింగ్ చేయాలని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.దీంతో విద్యార్థిని ఈ విషయాన్ని తోటి విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లింది. వాట్సాప్ చాటింగ్ స్క్రీన్‌షాట్స్ చూసిన వారంతా ఆగ్రహించారు. కాలేజీలోనే లెక్చరర్ రవిని పట్టుకుని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
