National

Parliament Session: దేశ రాజకీయాలను మార్చే రెండు కీలక బిల్లులు.. ఈ నెల 30 నుంచే పార్లమెంట్ సమావేశాలు!

Parliament Session: దేశ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30న లోక్‌సభ సమావేశాలు మొదలుకానుండగా, వచ్చే నెల 2వ తేదీ నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే, సాధారణ సమావేశాలకు భిన్నంగా ఈసారి జరగబోయే సెషన్‌పై దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది.