జాతీయం

Parliament Session: దేశ రాజకీయాలను మార్చే రెండు కీలక బిల్లులు.. ఈ నెల 30 నుంచే పార్లమెంట్ సమావేశాలు!

Parliament Session: దేశ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు.

Parliament Session: దేశ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30న లోక్‌సభ సమావేశాలు మొదలుకానుండగా, వచ్చే నెల 2వ తేదీ నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే, సాధారణ సమావేశాలకు భిన్నంగా ఈసారి జరగబోయే సెషన్‌పై దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

సభ ముందుకు మహిళా, డీలిమిటేషన్ బిల్లులు

ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును ప్రవేశపెట్టనుంది. రాబోయే రోజుల్లో దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని, నియోజకవర్గాల లెక్కలను పూర్తిగా మార్చేసే ఈ రెండు బిల్లులు సభ ముందుకు వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. కీలకమైన ఈ బిల్లులపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తర్వాత చదవండి