National
PSLVN1 Launch Delay: ప్రైవేట్ రాకెట్ PSLV-N1 ప్రయోగానికి బ్రేక్.. 2027 ఆరంభానికి వాయిదా!
భారత అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తున్న తొలి ప్రైవేట్ పీఎస్ఎల్వీ రాకెట్ 'పీఎస్ఎల్వీ-ఎన్1' (PSLV-N1) తొలి ప్రయోగం మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి ఈ ఏడాదిలోనే కనీసం రెండు ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని 2027 ప్రారంభంలో చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), లార్సెన్ & టూబ్రో (L&T) నేతృత్వంలోని కన్సార్టియం ఈ రాకెట్‌ను నిర్మిస్తోంది. ఇస్రోకు చెందిన భూ పరిశీలన ఉపగ్రహం 'ఈఓఎస్-10' (EOS-10)ను ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపాలని ప్రణాళిక రూపొందించారు.
