National

Rahulgandi : స్టాలిన్ వద్దకు రాహుల్, సోనియా, ఖర్గే.. డీలిమిటేషన్ బిల్‌ను అడ్డుకుంటారా?

దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ఎలాగైనా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదింపజేయాలని చూస్తున్నది. అందుకోసం దక్షిణాదికి జనాభా ప్రాతిపదికన కాకుండా 50శాతం మేర పార్లమెంట్ సీట్లు పెంచేందుకు కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే 25 ఏండ్ల వరకు మరల సీట్ల పెంపు, తగ్గించడం వంటివి ఉండవు. అప్పటివరకు సీలింగ్ ఉంటుంది.కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియా కూటమిలోని డీఎంకే అధినేత స్టాలిన్, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ అంగీకారం తెలిపాయి.డీఎంకే పార్టీ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. స్టాలిన్‌ను కలిసేందుకు చెన్నై వెళుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ సవరణ బిల్లులను వ్యతిరేకించాలని స్టాలిన్‌ను కోరేందుకు తాను, ఇండియా కూటమి నేతలు వెళుతున్నట్టు పేర్కొన్నారు.