తెలంగాణ
TelanganaWeather: హైదరాబాద్లో వర్షం.. రాష్ట్రంలో చలి మరింత పెరుగుతుందా?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. దీంతో రహదారులపై నీరు చేరగా, కొన్ని కాలనీల్లో వర్షపు నీరు ప్రవహించింది. ఇటీవల వర్షాలు లేక భూగర్భ జలాలు తగ్గి, తాగునీటి సమస్యలు, ట్యాంకర్ల డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ వర్షం నగరవాసులకు కొంత ఊరటనిచ్చింది.
