తెలంగాణ

TG: పురుషుడి శరీరంలో గర్భాశయం.. వికారాబాద్ జిల్లాలో అరుదైన ఘటన!

TG: వైద్య శాస్త్రానికే సవాల్ విసిరేలాంటి ఒక అరుదైన ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో వెలుగుచూసింది. సాధారణంగా స్త్రీలలో మాత్రమే ఉండే గర్భాశయం, ఒక 17 ఏళ్ల యువకుడి శరీరంలో ఉండటం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసి యువకుడి కుటుంబ సభ్యులతో పాటు వైద్యులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.పరిగి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అతడి శరీరంలో స్త్రీ పునరుత్పత్తి అవయవాలతో పాటు గర్భాశయం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. పురుషుడి శరీరంలో ఇలాంటి అవయవాలు ఉండటం వైద్య చరిత్రలో అత్యంత అరుదుగా (లక్షల్లో ఒకరికి) జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.