TG: వైద్య శాస్త్రానికే సవాల్ విసిరేలాంటి ఒక అరుదైన ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో వెలుగుచూసింది. సాధారణంగా స్త్రీలలో మాత్రమే ఉండే గర్భాశయం, ఒక 17 ఏళ్ల యువకుడి శరీరంలో ఉండటం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసి యువకుడి కుటుంబ సభ్యులతో పాటు వైద్యులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
వైద్య పరీక్షల్లో బయటపడ్డ అసలు నిజం
పరిగి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అతడి శరీరంలో స్త్రీ పునరుత్పత్తి అవయవాలతో పాటు గర్భాశయం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. పురుషుడి శరీరంలో ఇలాంటి అవయవాలు ఉండటం వైద్య చరిత్రలో అత్యంత అరుదుగా (లక్షల్లో ఒకరికి) జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఛత్రజీ ఆసుపత్రి వైద్యుల అద్భుత ఆపరేషన్
ఈ క్లిష్టమైన కేసును పరిగిలోని ఛత్రజీ ఆసుపత్రి వైద్యులు సవాల్‌గా తీసుకున్నారు. యువకుడి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో యువకుడి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అత్యంత అరుదైన ఈ కేసును సమర్థవంతంగా డీల్ చేసి, విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసిన ఛత్రజీ ఆసుపత్రి వైద్యులపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
