తెలంగాణ
టూరిజం కార్పొరేషన్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
TG: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థలో రెండు దశాబ్దాలకు పైగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్ ని సంఘం నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు.
