Revanth Reddy: తిరగబడుతున్న ఎమ్మెల్యేలు.. రేవంత్ కు తగ్గుతున్న మద్దతు
Revanth Reddy: తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో నిధుల కేటాయింపు, పెండింగ్ బిల్లులు, అధికారుల పనితీరు వంటి అంశాలపై సొంత ఎమ్మెల్యేలే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వ తీరుపై చర్చకు దారితీయడమే కాకుండా, ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశాన్ని ఇస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.రాష్ట్రంలో అభివృద్ధి నిధులన్నీ కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకే పరిమితమవుతున్నాయని అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. తెలంగాణ అంటే కేవలం కొడంగల్ (సీఎం రేవంత్ రెడ్డి), మధిర (డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క), హుజూర్నగర్ (మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి) నియోజకవర్గాలు మాత్రమే కాదని ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
