తెలంగాణ

TG: "కొందరికి ఎర్రి కుక్క కరిచినట్లు ఉంది.." రాజగోపాల్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఇన్‌డైరెక్ట్ కౌంటర్?

TG: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ వేదికపైనే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకులను ఉద్దేశించి సీఎం చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే సీఎం రేవంత్ రెడ్డి ఈ పరోక్ష కౌంటర్ ఇచ్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.పార్టీలో ఉంటూనే బహిరంగంగా విమర్శలు చేస్తున్న కొందరు నేతల వ్యవహారశైలిపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. "నిన్న మొన్న మా వాళ్లు కొంతమంది.. వాళ్లకు ఏమైందో మరి ఎర్రి కుక్క కరిచిందేమో కానీ, చెడంతా మైకుల్లో చెబుతుండ్రు. మంచి మాత్రం నా ఇంటికి వచ్చి చెవులో చెబుతుండ్రు" అని వ్యాఖ్యానించారు.