తెలంగాణ

TG: "కొందరికి ఎర్రి కుక్క కరిచినట్లు ఉంది.." రాజగోపాల్ రెడ్డికి సీఎం రేవంత్ ఇన్‌డైరెక్ట్ కౌంటర్?

TG: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ వేదికపైనే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకులను ఉద్దేశించి సీఎం చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే సీఎం రేవంత్ రెడ్డి ఈ పరోక్ష కౌంటర్ ఇచ్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

పార్టీలో ఉంటూనే బహిరంగంగా విమర్శలు చేస్తున్న కొందరు నేతల వ్యవహారశైలిపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. "నిన్న మొన్న మా వాళ్లు కొంతమంది.. వాళ్లకు ఏమైందో మరి ఎర్రి కుక్క కరిచిందేమో కానీ, చెడంతా మైకుల్లో చెబుతుండ్రు. మంచి మాత్రం నా ఇంటికి వచ్చి చెవులో చెబుతుండ్రు" అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, "ఇట్లాంటి కొంతమంది ఎర్రోళ్లు, ఎర్రి కుక్క కరిచినోళ్లు ఉంటారు.. వాళ్లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్లాగో ఎర్రగడ్డకు తీసుకపోతారనుకో" అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించేనా ఈ వ్యాఖ్యలు?

ఇటీవల కాలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలపై, ప్రభుత్వ నిర్ణయాలపై మీడియా ముందుకు వచ్చి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మైకుల ముందు విమర్శలు చేస్తూనే, మరోవైపు వ్యక్తిగతంగా కలిసినప్పుడు సానుకూలంగా మాట్లాడుతున్నారనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పేరు ప్రస్తావించకుండానే సీఎం చేసిన ఈ పరోక్ష దాడి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. మరి ముఖ్యమంత్రి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై సదరు నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

తర్వాత చదవండి